ఎన్టీఆర్ బర్త్ డేకి సర్ ప్రైజ్ ఇవ్వనున్న ఆర్ఆర్ఆర్ టీమ్!

  • మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు
  • 'కొమురం భీమ్' ను పరిచయం చేయాలని చిత్రబృందం ప్లాన్
  • ఇటీవల రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఇదే తరహాలో వీడియో
అగ్రశ్రేణి దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. ఇటీవలే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం సర్ ప్రైజ్ వీడియో రిలీజ్ చేసింది. ఇప్పుడదే రీతిలో జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మరో వీడియో విడుదల చేయాలని ఆర్ఆర్ఆర్ టీమ్ భావిస్తోంది. ఎన్టీఆర్ మే 20న పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పోషించిన కొమురం భీమ్ పాత్రను పరిచయం చేస్తూ ఓ సర్ ప్రైజింగ్ వీడియోను రిలీజ్ చేసేందుకు రాజమౌళి, ఇతర టీమ్ మెంబర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Junior NTR
RRR
Surprise
Video
Ramcharan
Rajamouli

More Telugu News